Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ కావాలి.. నా భర్తకు పెరోల్‌ ఇవ్వండి: ఓ మహిళ అభ్యర్థన

Webdunia
గురువారం, 18 మే 2023 (12:14 IST)
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలు అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకోసం జైల్లో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుద చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంది.

గ్వాలియర్‌లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్‌ జాతవ్‌ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ కేసులో అతడు దోషిగా తేలడంతో జీవితఖైదు విధించారు.

అప్పటి నుంచి గ్వాలియర్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఇటీవల దారా భార్య, కుటుంబసభ్యులు జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, అందువల్ల తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని దారా భార్య అభ్యర్థించింది.

దీనిపై సెంట్రల్‌ జైలు సూపరిండెంట్‌ మాట్లాడుతూ.. ఆ మహిళ దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర జైలు నిబంధనల ప్రకారం.. జీవితఖైదు పడిన దోషి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్‌ పొందే అవకాశముందని జైలు అధికారులు తెలిపారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments