ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన సోషల్ మీడియా పేజీలో మూడేళ్ల తన భర్త మార్కస్ రైకోనెన్ నుండి విడాకులు కోరిన విషయాన్ని ప్రకటించారు. సన్నా మారిన్, మార్కస్ రైకోనెన్ 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి 5 ఏళ్ల కూతురు ఉంది. ఈ నేపథ్యంలో తమ మూడేళ్ల వివాహ బంధానికి తెరపడుతుందని ప్రకటించారు. ఈ విషయంలో, వారిద్దరూ తమ ప్రత్యేక సోషల్ మీడియా పేజీలలో ఇలా పేర్కొన్నారు.
"మేము 19 సంవత్సరాలు కలిసి ఉన్నందుకు మా ప్రియమైన కుమార్తె కోసం కృతజ్ఞతలు. ఇకపై మేము మంచి స్నేహితులుగా ఉంటాము. మేము మా యవ్వనంలో కలిసి జీవించాము, కలిసి యుక్తవయస్సులోకి ప్రవేశించాము.. ఇప్పుడు వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నాం." అంటూ చెప్పుకొచ్చారు.
37 ఏళ్ల మారిన్, ఆమె 2019లో ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులోనే ప్రధాని పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.