Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెల్లవారితే పెళ్లి.. అక్క భర్తతో లేచిపోయిన వధువు.. ఎక్కడ?

Advertiesment
marriage
తెల్లవారితే పెళ్లి ముహూర్తం. ఇంతలో పెళ్లింట వధువు కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా ఆమె.. తన అక్క భర్తతో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వధువు, వరుడు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం కన్నాపూర్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 20 యేళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. పెద్దలు కుదిర్చిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహ వేడుక జరగాల్సివుంది. ఈ వివాహాన్ని వధువు ఇంటివద్దే చేయాలని నిర్ణయించడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేశారు. తెల్లారితే ముహూర్తం జరగాల్సివుంది. ఇంతలో వధువు ఇంట్లో కనిపించలేదు. వధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత వారికి అసలు విషయం తెల్సింది. 
 
పెళ్లిపీటలపై కూర్చోవలసిన యువతి కాస్త.. తన అక్క భర్తతో లేచిపోయింది. మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన తన చెల్లిని కట్టుకున్న భర్త ప్రేమ పేరుతో తీసుకెళ్లడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. తన భర్త, చెల్లి మధ్య సాగిన ప్రేమ వ్యవహారాన్ని గుర్తించలేకపోవడం తనదే తప్పు అని చెబుతోంది. చివరకు ఈ వివాహం రద్దు కావడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశోక్ గెహ్లాట్ ప్రశంసలు కుట్రపూరితం : వసుంధరా రాజే