Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 1 నుంచి ఓటరు గుర్తింపు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:21 IST)
ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డును తమ మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. తమ రిజిస్టర్డ్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడంతో పాటు మొబైల్ ఫోన్ లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇప్పటివరకు ఓటరు గుర్తింపు కార్డును సమీపంలోని మీ-సేవా కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్ (ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది.

ఓటరు తమ రిజిస్టర్డ్ మొబైల్ లోనే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు. 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితాలో కొత్తగా నమోదైన యువ ఓటర్లకు తొలుత ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ద్వారా ఈ నెల 25 నుంచి 31 వరకు ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు 'ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఏపిక్ అనే పేరుతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ పోర్టల్ http:// voterportal.eci.gov.in, లేదా జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్ https:// nsvp.in ద్వారా ఈ-ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments