Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలు

ఫిబ్రవరి 20న రేణిగుంట నుంచి భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలు
, శనివారం, 23 జనవరి 2021 (11:16 IST)
రేణిగుంట రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చే నెల 20న భారత్‌ దర్శన్‌ గంగ, యమున యాత్రా స్పెషల్‌ రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ సౌత్‌సెంట్రల్‌జోన్‌ జీఎం రవికుమార్‌, డీజీఎం డి.కిషోర్‌, తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ నాగరమణశర్మ తెలిపారు.

ఈ యాత్ర ఆరు రాత్రులు, 7 పగళ్లు ఉంటాయన్నారు. ప్రయాగరాజ్‌, వారణాసి, గయాలకు చేరుకుని, అక్కడ దర్శనీయ స్థలాలు, గంగ, యమున, త్రివేణి సంగమం సందర్శన ఉంటుందన్నారు.

స్లీపర్‌ క్లాసులో ఒక టిక్కెట్‌ రూ.7140, 3ఏసీలో టికెట్‌ రూ.8,610 అన్నారు. పర్యాటకులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఉచిత భోజనం, వసతి తదితరాలను కల్పించారు.

ఈ యాత్రా స్పెషళ్లకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 0877-2222010, 82879 32317, 82879 32313 నెంబర్లలో సంప్రదించవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ఘాట్‌లో ద్విచక్రవాహనాలకు సమయం పెంపు