పుష్పగిరి మహా సంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి నుంచి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆశీర్వచనాలు అందుకున్నారు. ధార్మిక యాత్రలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విద్యాశంకర భారతీ స్వామికి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి అధికారులు ఆలయ మర్వాదలతో స్వాగతం పలికారు.
అనంతరం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలో జరుగుతున్న “చతుర్వేద హామం“ లో పాల్గొన్న భారతీ స్వామిజీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో 800 ఏళ్ల చరిత్ర గల అతి పురాతన సనాతన పీఠం పుష్పగిరి మహా సంస్థానం అన్నారు.
పుష్పగిరి మహా సంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి లోక కళ్యాణార్థం మరియు దేశ సంరక్షనార్థము సంకల్పించిన యాత్రలో భాగంగా ఇంద్రకీలాద్రికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని ధార్మిక కార్యక్రమాలకు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విద్యాశంకర భారతీ స్వామి తెలిపారని అన్నారు.
అదే విధంగా రాష్ట్రాంలోని అన్ని ప్రధాన అలయాల్లో “చతుర్వేద హామం నిర్వహించాలని, ఇటివల దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ధర్మచారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని వారి సలహాలు, సూచనలు పాటించాలని సూచించారన్నారు.