దేశంలో మరో 13 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:10 IST)
దేశంలో 13 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 13,203 మందికి కరోనా వైరస్ సోకింది. వీటితో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది. అదేస‌మ‌యంలో ఈ వైరస్ బారి నుంచి 13,298 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,470కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు. 1,84,182 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 16,15,504మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో ఆదివారం వరకు మొత్తం 19,23,37,117 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,70,246 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Oscars 2025: ఎలిజిబుల్ ఫిల్మ్స్ బెస్ట్ పిక్చర్స్ రేసులో కాంతార చాప్టర్ 1

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

తర్వాతి కథనం
Show comments