Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. కూతురిపై తండ్రి అత్యాచారం.. ఎన్నికల పోటీ నుంచి..?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోలేదని దుర్మార్గానికి పాల్పడ్డాడు. తనకు పోటీగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థిని ఢీకొనలేక.. అతడి కూతురుని కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 
 
అయితే, ఓ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తాననిఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. అది నచ్చని గ్రామానికి చెందిన మరో వ్యక్తి.. అతడిని పోటీ నుంచి తప్పుకోవాలని సూచించాడు. అయినా పోటీ చేస్తానని పట్టుబట్టడంతో పలు విధాలుగా బెదించడంతోపాటు హెచ్చరించాడు. 
 
అయినా సదరు వ్యక్తి పోటీ నుంచి తప్పుకోలేదు. దీంతో అతడి కుటుంబాన్ని టార్గెట్‌ చేశారు. స్కూల్‌కు వెళ్లొస్తున్న పదో తరగతి చదివే అతడి కూతురును మంగళవారం కిడ్నాప్‌ చేశారు. బాలికను ఓ గదిలో బంధించి ఆకాశ్‌ వర్మ, లాల్‌జీ వర్మ, సచిన్‌ వర్మ, శివమ్‌ వర్మ కలిసి సామూహిక అత్యాచారం చేశారు.
 
అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో ఆయన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోటీ నుంచి తప్పుకోకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ మనోజ్‌ పాండే తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments