Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త దుబాయ్‌లో.. భార్య వేరొక వ్యక్తితో రాసలీలలు.. తండ్రి ఏం చేశాడంటే?

Advertiesment
భర్త దుబాయ్‌లో.. భార్య వేరొక వ్యక్తితో రాసలీలలు.. తండ్రి ఏం చేశాడంటే?
, సోమవారం, 15 మార్చి 2021 (17:25 IST)
కడప జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కన్నతండ్రే కూతురు ప్రవర్తన నచ్చకుండా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని వేంపల్లి పట్టణానికి చెందిన గురువేంధ్రతో రాజేశ్వరానికి చెందిన మహిళకు 2009లో పెళ్లి జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే బతుకుదెరువు కోసం గురువేంధ్ర దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ సంపాదించి నెల నెలా ఇంటికి డబ్బులు పంపించేవాడు. 
 
భర్త దుబాయ్‌కి వెళ్లడంతో.. అతని భార్య ప్రొద్దుటూరులోని తన తల్లిదండ్రుల ఉంటోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెను పలుమార్లు హెచ్చిరంచారు. అయినా ఆమె తీరు మారలేదు. ఈ నేపథ్యంలో గురువేంధ్ర దుబాయ్ నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చాడు. దాంతో సదరు మహిళ మెట్టినిళ్లు అయిన వెంపల్లికి వచ్చింది. కానీ, గురువేంధ్రతో తాను ఉండనని సదరు మహిళ తెగేసి చెప్పింది. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా భర్తను బలవంతపెట్టింది.
 
తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇలా నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దాంతో ఏం చేయాలో పాలుపోని గురువేంధ్ర.. ఆమెకు సర్దిచెప్పాలంటూ అత్తమామల వద్దకు తీసుకెళ్లాడు. కానీ, అక్కడా ప్రయోజనం లేకుండా పోయింది.
 
పైగా గొడవలు పెరిగి.. ఇంటి పంచాయతీ కాస్తా రోడ్డుకెక్కింది. తన కూతురు పరువు పోతోందని భావించిన ఆమె తండ్రి.. ఆమె మెడకు చున్నీ చుట్టి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాజ్ మహల్ పేరు మారబోతుందట.. రామ్ మహల్ లేదంటే రామ్ మందిర్.. చెప్పిందెవరంటే?