తెలంగాణ రాష్ట్రంలో కన్నబిడ్డతో కామకోర్కెలు తీర్చుకున్న కామాంధ తండ్రికి 20 యేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చింది.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన 50 యేళ్ళ కామాంధుడు ఎనిమిదో తరగతి చదివే 13 యేళ్ళ కుమార్తె వుంది. 2019 అక్టోబరులో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భార్యను కొట్టి విషయం బయటకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని హెచ్చరించాడు.
ఈ లైంగికదాడిపై సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రఘునాధ్‌రెడ్డి బుధవారం తుది తీర్పునిస్తూ 20 యేళ్ల జైలుతో పాటు.. వెయ్యి రూపాయల అపరాధం కూడా విధించారు.