Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పాస్‌పోర్టుపై ప్రియుడితో ఆస్ట్రేలియాకు భార్య.. లాక్డౌన్‌తో కష్టాలు!

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (12:45 IST)
ఓ మహిళ తన భర్త పాస్‌పోర్టుపై తన ప్రియుడిని తీసుకుని ఆస్ట్రేలియా దేశానికి వెళ్లింది. అక్కడ రెండు నెలల పాటు ఎంచెక్కా రాసలీలల్లో మునిగితేలింది. తీరా స్వదేశానికి బయలుదేరుదామని అనుకోగానే, కరోనా లాక్డౌన్‌తో అక్కడే చిక్కుకుని పోయింది. ఇంతలో కట్టుకున్న భర్త ఇంటికి రావడంతో భార్య బాగోతం బహిర్గతమైంది. తన భార్య చేసిన నిర్వాకంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెతో పాటు.. ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఫిలిబిత్‌ సమీపంలోని దామ్‌గరీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (46) గత 20 యేళ్లుగా ఉద్యోగ రీత్యా ముంబైలో నివసిస్తున్నాడు. ఆయన భార్య(36) మాత్రం ఆ గ్రామంలోనే ఒంటరిగా నివసిస్తోంది. ఈమెలో చెలరేగే కోర్కెలను అణుచుకోలేక... అదే గ్రామానికి చెందిన 36 యేళ్ల సందీప్ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, తన భర్త మే నెల 18వ తేదీన వస్తానని ముందుగానే చెప్పారు. 
 
ఈ తేదీనే ఆమె తనకు అనుకూలంగా మార్చుకుంది. గ్రామంలో ఎంజాయ్ చేయడం కంటే.. విదేశాల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని భావించిన ఆ మహిళ తన ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాకు ప్లాన్ చేసింది. భర్త గ్రామానికి వచ్చేలోపు స్వదేశానికి వచ్చేలా వారు టూర్ ప్లాన్ చేసుకున్నారు. అంతే.. తన భర్త పాస్‌పోర్టుపై ప్రియుడిని తన వెంట తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది. అక్కడ కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత స్వదేశానికి బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నారు. 
 
ఇంతలో దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. కానీ ఆమె భర్త మాత్రం ముందుగా చెప్పినట్లుగానే మే 18వ తేదీన ఇంటికి రాగా భార్య కనిపించలేదు. ఇరుగు పొరుగువారిని విచారించగా అసలు విషయం చెప్పారు. దీంతో భార్య, సంతోష్‌ సింగ్‌పై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఇంత జరిగాక.. ఆగస్టు 24న ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియా నుంచి దిగిందామె!! దొంగ పాస్ పోర్టుపై విదేశాలకు వెళ్లడం, వివాహేతర సంబంధం పెట్టుకోవడం తదితర నేరాలపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments