Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్గొండ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఇక్కడ రావచ్చుగా అంది: ఆమె నెంబర్ బ్లాక్ చేశానన్న కృష్ణుడు

నల్గొండ నుంచి ఓ మహిళ ఫోన్ చేసి ఇక్కడ రావచ్చుగా అంది: ఆమె నెంబర్ బ్లాక్ చేశానన్న కృష్ణుడు
, శనివారం, 29 ఆగస్టు 2020 (14:01 IST)
తనపై 143 మంది అత్యాచారం చేసారనీ, అందులో పలువురు సినిమావాళ్లు వున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలపై నటుడు కృష్ణుడు స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. హైదరాబాద్ నగరంలో పటిష్టమైన పోలీస్ వ్యవస్థతో పాటు నిరంతరం అందుబాటులో ఉండే షిటీమ్స్ వ్యవస్థ అందుబాటులో ఉందనీ, చదువుకున్న యువతి తనకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు కృష్ణడు ప్రశ్నించాడు. 
 
నిజంగా తనకు అన్యాయం జరిగి ఉంటే డయల్ 100కు ఫోన్ చేసుంటే పోలీసులు తక్షణమే స్పందించి ఉండేవాళ్లు. మమ్మలి కలవడానికి చాలా మంది వస్తుంటారు. సెలబ్రటీలను కేసులో ఇన్వాల్‌ చేయడంతో కేసు తీవ్రత పెరుగుతుందంటే తప్పు. ఈ కేసులో నిజానిజాలను పోలీసులు వెలికితీస్తారు అని కృష్ణుడు చెప్పారు.

మద్యం తాగించి అత్యాచారం చేసేవారు... యువతి ఆరోపణ

ముఖ్యంగా, ఇలాంటి ఆరోపణలతో మేము, మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చాడు. నాలుగైదు నెలల క్రితం నల్గొండ జిల్లా నుంచి ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. నీను మీ అభిమానిని, నల్గొండకు రావాలని ఫోన్‌లో చేప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి కాల్‌కట్ చేసి నెంబర్‌ను బ్లాక్ చేశాను. ఈ కేసులో పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు కానీ, ఫోన్‌ కానీ నాకు రాలేదు. నేను ఈ కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తాను అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డియర్ కామ్రేడ్' హిందీ డబ్బింగ్‌‌కు భారీ రెస్పాన్స్.. 160 మిలియన్ వ్యూస్