Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం వేధింపులు - కోడలికి హెచ్.ఐ.వి. ఇంజెక్షన్లు : భర్త - అత్తమామలపై కేసు

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (09:28 IST)
కోడలిని అత్తమామలను అదనపు కోసం వేధించారు. ఈ కట్నం తెచ్చేందుకు ఆమె నిరాకరించారు. దీంతో అత్త మామలు ఓ దారుణానికి పాల్పడ్డారు. కోడలికి హెచ్.ఐ.వి. ఇంజక్షన్లు ఇచ్చారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. బాధిత యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు స్థానిక కోర్టులో కేసు నమోదైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల మేరకు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‍‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో గత 2023 ఫిబ్రవరి 15వ తేదీన సోనాల్ సైనికి వివాహం జరిగింది. ఈ సందర్భంగా రూ.15 లక్షలుతో పాటు కారును కట్నంగా ఇచ్చారు. 
 
ఆ తర్వాత కొంతకాలానికి స్కార్పియో ఎస్యూవీ కారు, రూ.25 లక్షలు నగదు ఇవ్వాలంటి అత్తింటి వారు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. వారు డిమాండ్‌ను నెరవేర్చేందుకు సోనాల్ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో భర్త, అత్తమామలు కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి గెంటివేశారు. ఆ తర్వాత పెద్దలు పంచాయతీ నిర్వహించి సోనాల్‌ను తిరిగి ఇంటికి పంపించారు. 
 
అయితే, ఆ తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. భౌతికంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. తన కుమార్తెను చంపేందుకు కుట్ర చేశారంటూ సైని తండ్రి ఆరోపించారు. ఆ తర్వాత కొంతకాలానికి యువతి ఆరోగ్యం క్షిణించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆమెకు హెచ్.ఐ.వి సోకినట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆమె భర్త అభిషేక్‌కు ఇదే పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ అని తేలింది. దీంతో భర్త, అత్తమామలు కలిసి చంపేందుకు బలవంతంగా హెచ్.ఐ.వి ఇంజెక్షన్లు ఇచ్చివుంటారని అనుమానించారు. 
 
దీనిపై సైని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు భర్త అభిషేక్, అత్త మామలపై వరకట్న వేధింపులు, హత్యాయత్నం, దాడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments