ఓ మహిళ పడకసుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని మరో వ్యక్తికి దగ్గరైంది. చివరకు అతని వేధింపుల కారణంగానే తన ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చందన్ సింగ్ అనే వ్యక్తి భార్య మమత (31). 12 యేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త గ్యాస్ స్టౌవ్‌లు రిపేర్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. భార్య ఇంటిపట్టునే ఉంటూ పిల్లల బాగోగులు చూస్తుంటారు. ఈ క్రమంలో మమతకు అదే ప్రాంతానికి చెందిన రాకేష్ గౌడ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
కొంతకాలం సాఫీగా సాగినప్పటికీ ఆ తర్వాత మమతను రాకేష్ పలు విధాలుగా వేధింపులకు గురిచేయసాగాడు. వీటిని భరించలేని మమత ప్రాణాలు తీసుకుంది. బుధవారం తమ ఇంట్లోనే ఉరి వేసుకుంది. మృతురాలి శరీరంపై కూడా గాయాలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మమత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు రాకేష్ గౌడ్, భర్త చందన్ సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.