Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 29 April 2025
webdunia

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

Advertiesment
Harassment

ఐవీఆర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (18:34 IST)
ఈమధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వచ్చాక సంబంధాలు చాలా సింపుల్‌గా ఏర్పడుతున్నాయి. అందులో అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు మొబైల్ చాటున మరింత బలపడుతున్నాయి. వీటి కారణంగా ఎవరో ఒకరు బలి అవుతూనే వున్నారు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషను పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పది రీతిలో మృతి చెందింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని ఉప్పల్ హనుమసాయి నగర్‌కి గత 12 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చందన్ సింగ్ తన భార్య మమతతో వచ్చి స్థిరపడ్డాడు. చందన్ సింగ్ గ్యాస్ స్టౌవ్‌లను రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం కూడా వున్నారు. ఐతే చందన్ సింగ్ భార్యను షాపులో పెట్టి రిపేర్లు చేసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో షాపులో వున్న మమతపై అదే ప్రాంతానికి చెందిన రాకేష్ గౌడ్ కన్నేసాడు.
 
ఆమెతో స్నేహం చేస్తున్నట్లు మెలుగుతూ మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో మమతను మందలించినట్లు సమాచారం. భర్త మందలింపుతో మమత భయపడిపోయి ఇక నుంచి తన వద్దకు రావద్దని రాకేష్ గౌడ్‌కి గట్టిగా చెప్పేసింది. ఐతే రాకేష్ గౌడ్ ఆమె మాటలను ఎంతమాత్రం పట్టించుకోకుండా ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన మమత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఐతే ఆమె శరీరంపై గాయాలు వుండటంతో భార్యను హత్య చేసి భర్తే ఆమెని ఉరికి వేలాడదీశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?