Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అశ్లీల వీడియోలు చూపించి సైకో భర్త టార్చర్.. భార్య సూసైడ్!!

Advertiesment
అశ్లీల వీడియోలు చూపించి సైకో భర్త టార్చర్.. భార్య సూసైడ్!!

ఠాగూర్

, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (17:10 IST)
విశాఖపట్టణంలోని గోపాలపురంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన కేవలం 11 నెలలకే ఆమె ప్రాణాలు తీసుకుంది. మృతురాలిని వసంతగా గుర్తించారు. అశ్లీల వీడియోలు చూపిస్తూ కట్టుకున్న సైకో భర్త నాగేంద్ర బాబు చిత్ర హింసలకు గురిచేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. తమ కుమార్తెను భర్త, అత్త, మామ, మరిది కలిసి చంపేశారంటూ వసంత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన విశాఖపట్టణంలోని గోపాలపట్నం, నందమూరి కాలనీలో జరిగింది. 
 
ఈ కాలనీకి చెందిన నాగేంద్ర బాబుకు 11 నెలల క్రితం వసంత అనే యువతితో వివాహం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టారు. అశ్లీల వీడియోలు చూపిస్తూ టార్చర్‌కు గురిచేశాడు. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్ళ వద్ద చెప్పుకుని కుమిలిపోసాగింది. అయితే, ఈ వేధింపులు మరింతగా పెరిగిపోవడంతో ఇక భరించలేకపోయింది. ఈ క్రమంలో గత రాత్రి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన భర్త పెడుతున్న చిత్రహింసలను వివరించింది. దీంతో వారు వచ్చి మాట్లాడుతామని, అప్పటివరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు. కానీ, వసంత మాత్రం అంతంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నందమూరి కాలనీకి వచ్చి అత్తింటివారిని నిలదీశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని భర్త, అత్త, మామ, మరిది కలిసి చంపేశారంటూ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు- పార్లమెంటరీ నియోజకవర్గాలకు జనసేన సమన్వయకర్తలు