Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంతంగా వివాదాస్పద అయోధ్య నగరం

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:30 IST)
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు గురించి దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, వివాదాస్పద స్థలం ఉన్న అయోధ్య నగరం మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని స్థానిక హిందువులు, ముస్లింలు స్పష్టం చేస్తున్నారు. మందరిమైనా.. మసీదు అయినా ఫర్వాలేదని తమకు శాంతి మాత్రమే ముఖ్యమని వారు చెప్తున్నారు. 
 
'మాకు ఎలాంటి ఉత్కంఠ లేదు. తీర్పు ఎలా వచ్చినా స్థానికులకు ఇబ్బందేం లేదు. కొందరు స్థానికేతరులు మాత్రం గొడవ చేసే అవకాశం ఉంది'  అని ఓ వ్యాపారి అన్నారు. నగరంలోని కొందరు ముస్లింలు రామాలయ నిర్మాణానికి మద్దతు పలకడం విశేషం. 
 
'త్వరలోనే హిందువులకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇక్కడ పెద్ద రామాలయం నిర్మాణం అవుతుంది' అని ఓ ముస్లిం వ్యాపారి పేర్కొన్నారు. '1992లో ఘర్షణలు చెలరేగినప్పుడు మా దుకాణం మొత్తం ధ్వంసమైంది. కొన్నిరోజులపాటు కుటుంబం మొత్తం పస్తులు ఉన్నాం. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదు' అని మరో వ్యాపారి అన్నారు. 
 
ఇదిలావుంటే, అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే యూపీలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. సుప్రీంకోర్టు ఈ నెల 17లోగా తుది తీర్పు వెల్లడిస్తుందని అంచనా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments