Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని ఎదురుగా మహిళ నడుముపై చేయి వేసిన క్రీడల మంత్రి...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:40 IST)
బాధ్యత గల పదవిలో ఉండి అందరినీ సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఒక మంత్రి వక్రబుద్ధిని బయటపెట్టాడు. పట్టపగలే ఒక వేదికపై మరో మహిళా మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది కూడా సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా నిల్చుని మరీ అలా చేయడం గమనార్హం.
 
వివరాల్లోకి వెళితే గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీ త్రిపుర రాజధాని అగర్తలలో ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రితో పాటు చాలామంది మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తున్న సమయంలో మోదీకి ఎదురుగా నిల్చున్న మంత్రుల బృందంలోని రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి మనోజ్ కాంతి దేవ్ తన పక్కనే నిల్చుని ఉన్న మహిళా మంత్రి నడుముపై చేయి వేసి అసభ్యంగా తాకాడు.
 
అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో అతనిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మనోజ్ కాంతి దేవ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై సదరు మంత్రి స్పందించేందుకు నిరాకరించగా బిజెపి మాత్రం దీన్ని తోసిపుచ్చింది. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే ప్రతిపక్షం ఇలా చేస్తోందని వారిపై దుమ్మెత్తి పోసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments