Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలిసిన ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు.. అక్కాచెల్లెళ్లపై 2 రోజుల పాటు..?

Advertiesment
తెలిసిన ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కారు.. అక్కాచెల్లెళ్లపై 2 రోజుల పాటు..?
, శనివారం, 17 నవంబరు 2018 (17:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా అక్కాచెల్లెళ్లను అపహరించి.. వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అగర్తలాకు 140 కిలోమీటర్ల దూరంలో వున్న కైలాషహర్ సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం అక్కాచెల్లెళ్లు ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో తెలిసిన ఆటో డ్రైవర్ రావడంతో ఆటో ఎక్కారు. 
 
అయితే ఆ ఆటోలో మరో ఇద్దరు పురుషులు వున్నారు. ఆటో కొంచెం దూరం పోయాక.. వాళ్లు అక్కాచెల్లెళ్ల తలకు టవాల్స్ కట్టేశారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ను బెదిరించి తెలిమర పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ వారిని బంధించి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తర్వాత వారిని వదిలిపెట్టారు. 
 
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. పరారీలో వున్న ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుందా...