Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే... ఎక్కడ?

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:43 IST)
రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు కేసులు లేక పెట్టింది కాదు ఇది. ఓ ఐటీ కంపెనీ ఓనర్‌కు ఎదురైనా చేదు అనుభవం. ఇప్పటివరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99 శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం. విశేషం. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో నివసిస్తుంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్‌కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. 
 
ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్. విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్‌ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్‌ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. 
 
కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతేకాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటివరకు ఇలాంటి రూల్ ఉందన్న సంగతి తెలియదని, లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు. తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments