Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో

ఎయిర్‌పోర్ట్ రన్‌ వేపై చేపలు సందడి.. వీడియో
, మంగళవారం, 2 జులై 2019 (19:16 IST)
ప్రతిరోజూ వందల సంఖ్యలో విమానాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలకు ఎయిర్‌పోర్ట్ రన్‌వే ఇప్పుడు చెరువుగా మారింది.

కొన్ని రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు ఎయిర్‌పోర్ట్‌లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలతో సందడి వాతావరణం నెలకొంది.
 
వేసవికాలం నుండి ఉపశమనం కోరుకున్న ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు.


పోర్ట్‌కు సమీపంలో ఉన్న చెరువు నుంచి చేపలతో పాటు అనేక జలచరాలు ఉన్నాయి. అందులో పాములు కూడా ఉండడం విశేషం.
 
ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు చేపలతో సందడిగా మారిపోయింది. క్యాట్ ఫిష్‌లతో పాటు పలు రకాల చేపలు వరద నీటిలో కొట్టుకొస్తున్నాయి. పైలట్‌లు సైతం ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌లో చేపల వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రన్‌వేపై పట్టిన చేపలను చెరువుల్లోకి వదిలేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మర్రి చెన్నారెడ్డి కొడుకుని... ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోనే.. : మర్రి శశిధర్ రెడ్డి