Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక బలాత్కారం

హస్తినలో మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక బలాత్కారం
Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (12:04 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా టూరిస్ట్ గైడ్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ గ్యాంగ్ రేప్ ఓ స్టార్ హోటల్‌లో జరగడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ కథనం ప్రకారం.. కనాట్ ప్లేస్‌ మార్కెట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బాధిత మహిళ టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తోంది. హోటల్‌లో ఆదివారం తనపై సామూహిక అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
హోటల్‌లో గదిని బుక్ చేసుకున్న నిందితులు బాధితురాలికి డబ్బు అవసరం ఉన్నట్టు గుర్తించారు. తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మబలికి హోటల్ గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజ్ శర్మను అరెస్టు చేసినట్టు సింఘాల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం