Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో జాబ్ ఫ్రాడ్స్.. కోట్లాది రూపాయల మోసం

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (17:31 IST)
విదేశాలతో పాటు, ప్రముఖ కంప్యూటర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కేరళ యువకుల నుంచి లక్షల్లో డబ్బులు దోచేశారు. ఈ విషయమై ఆ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు కాసర్‌గోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
తిరువనంతపురంకు చెందిన శరణ్య, పాలక్కాడ్‌కు చెందిన మను దంపతులు యువకులను మోసగించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 
 
మరోవైపు ఇదే కేరళలో టైటానియం జాబ్ ఫ్రాడ్ కేసులో తాజాగా రూ.15 కోట్ల మోసం జరిగినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దివ్య నాయర్ భారీ మొత్తంలో డబ్బును స్వాహా చేసినట్లు పోలీసులకు చెప్పారని, ఆమె డైరీలో కోటి రూపాయలకు పైగా లావాదేవీల వివరాలు ఉన్నాయని సమాచారం. 
 
కాగా, ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న ట్రావెన్‌కోర్ టైటానియం ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TTP)లీగల్ ఏజీఎం శశికుమారన్ థంపిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో దివ్య జ్యోతి అలియాస్ దివ్య నాయర్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో టీటీపీ లీగల్ ఏజీఎంపై చర్యలు తీసుకుంది. 
 
ఈ కేసులో దివ్య భర్త రాజేష్, తంపి స్నేహితులు ప్రేమ్ కుమార్, శ్యామ్‌లాల్‌లు ఇతర నిందితులుగా ఉన్నారు. పోలీసులు దివ్యను పట్టుకున్నప్పటికీ, మిగతా నిందితులందరూ పరారీలో వున్నారు. నిందితులు ఓ ముఠాగా ఎంపికై.. టీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బును కాజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments