Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (12:09 IST)
తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ పోసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ చర్యకు పాల్పడిన ఆ యువతిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురం, పూజపుర అనే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ (27) అనే యువకుడు ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను ప్రేమించాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ కొనసాగింది. పైగా, కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని షీబా ఒత్తిడి చేసింది. కానీ, ఏడేళ్ళ వయస్సు వ్యత్యాసం ఉండటంతో అరుణ్ కుమార్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన షీబా... ప్రియుడి ముఖంపై యాసిడ్ పోయడంతో అతనికి కంటి చూపు పోయింది. 
 
ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి షీబాను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కాలేజీకి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments