ఓ వర్థమాన సినీ నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. తమిళనాడులోని కన్యాకుమారిలోని కులశేఖర ప్రాంతంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని అక్కడి స్థానిక ప్రజలే పో
ఓ వర్థమాన సినీ నటి వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. తమిళనాడులోని కన్యాకుమారిలోని కులశేఖర ప్రాంతంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని అక్కడి స్థానిక ప్రజలే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. దీనితో వల పన్ని వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కన్యాకుమారిలోని ఓ లాడ్జికి తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీ, కేరళ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికంగా వస్తుంటారు. ఈ క్రమంలో ఆ లాడ్జిలో వ్యభిచారం చేసేందుకు సదరు నటి ముగ్గురు యువతులతో కలసి అక్కడికి వచ్చింది. దీన్ని గమనించిన ప్రజలు వారి వాలకం తేడాగా కనబడటంతో పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కోలీవుడ్ చిత్రాల్లో సహాయ నటిగా చేస్తున్న 18 సంవత్సరాల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు వచ్చిన మరో ముగ్గురు పరారయ్యారు. కాగా తనతోపాటు వచ్చిన అమ్మాయిలు చెన్నైకి చెందినవారుగా ఆమె పోలీసులకు వెల్లడించింది. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.