సీనియర్ నటి జయంతి నిక్షేపంలా జీవించేవున్నారు...
						
		
						
				
సీనియర్ నటి జయంతి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 యేళ్ళ ఈమె... కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
			
		          
	  
	
		
										
								
																	సీనియర్ నటి జయంతి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 73 యేళ్ళ ఈమె... కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అలాంటిదేంలేదని మొత్తుకుంటున్నా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె జీవించి నిక్షేపంలా ఉన్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	నిజానికి ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులతో మంగళవారం బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయంతి, మంగళవారం రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై స్పందించిన జయంతి కుటుంబ సభ్యులు ఆమె నిక్షేపంలా ఉన్నారని, కోలుకుంటున్నారని తెలిపారు. 
 
									
										
								
																	
	 
	జయంతి తన కెరియర్‌లో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ తదితర భాషల్లో మొత్తం 500 సినిమాల్లో నటించగా, అందులో 300 సినిమాలు లీడ్ రోల్ కావడం విశేషం. కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండుసార్లు ఉత్తమ నటి అవార్డులు, అలాగే రాష్ట్రపతి అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.