Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిప్‌స్టిక్ బాబా... పురుషులతో శృంగారం... ఆ తర్వాత....

డేరా సచ్చసౌధా వ్యవస్థాపకుడు గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ అలియాస్ డేరా బాబా రాసలీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆశ్రమంలో ఉన్న మహిళలను బెదిరించి వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తేలింది.

Advertiesment
లిప్‌స్టిక్ బాబా... పురుషులతో శృంగారం... ఆ తర్వాత....
, గురువారం, 29 మార్చి 2018 (16:34 IST)
డేరా సచ్చసౌధా వ్యవస్థాపకుడు గుర్మీత్ రామ్ రహిమ్ సింగ్ అలియాస్ డేరా బాబా రాసలీలల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆశ్రమంలో ఉన్న మహిళలను బెదిరించి వాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు తేలింది. అయితే.. దానికి పూర్తి విరుద్ధంగా ఇపుడు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇపుడు ఓ నకిలీ బాబా కేవలం యువకులతోనే శృంగారం సాగిస్తూ వచ్చిన వ్యవహారం గుట్టురట్టయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఝాల్వార్ ప్రాంతానికి చెందిన కుల్‌దీప్ సింగ్ ఝాలా. ఈయనకు ముద్దు పేర్లు మాత్రం అనేకం. అయితే, స్థానికులంతా ముద్దుగా పెట్టుకున్న పేరు మాత్రం లిప్‌స్టిక్ బాబా. దీనికి కారణం లేకపోలేదు. దేవీ నవరాత్రుల సమయంలో అచ్చం మహిళలాగా తయారై.. పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుంటాడు. అందుకే ఆ బాబాకు లిప్‌స్టిక్ బాబా అని ముద్దుపేరు. అంతేనా, సాక్షాత్తూ దైవ సంభూతులు, శక్తి, జగదాంబ పునర్జన్మనని ఆయనే చెప్పకుంటుంటారు. 
 
అలాంటి ఆయన ఇపుడు రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ బాబా రాసలీలలు సాగించేది మహిళలతో కాదు.. యువకులతో, పురుషులతో. అంతేకాదు తనకున్న పురుష ఫాలోవర్స్‌తో శృంగారం చేసిన అనంతరం వాళ్లను టార్చర్ పెట్టడం.. ఆత్మహత్యకు పురిగొల్పడం ఇదే లిప్‌స్టిక్ బాబా స్టైల్. ఇలా 20 ఏళ్ళ ఫాలోయర్‌తో శృంగారం చేసి.. ఆ తర్వాత అతడిని టార్చర్ పెట్టి.. ఆత్మహత్యకు పురిగొల్పినట్టు ఆరోపణలు రావడంతో ఝాలావర్ పోలీసులు లిప్‌స్టిక్ బాబాను అరెస్ట్ చేశారు. దీంతో ఆ బాబా అసలు బాగోతమంతా బయటపడింది. 
 
యువరాజ్ సింగ్ అనే యువకుడు ఫిబ్రవరిలో సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్ ఓ అమ్మాయితో స్నేహంగా ఉంటున్నాడంటూ టార్చర్ పెట్టడంతోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడని సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో లిప్‌స్టిక్ బాబా బారిన పడిన మరో ఏడుగురు ఫాలోవర్లు అతడి బాగోతాలను పోలీసులకు వివరించారు. తమను శృంగారంలో పాల్గొనాలని లిప్‌స్టిక్ బాబా ఒత్తిడి తెచ్చేవాడని, శృంగారం తర్వాత టార్చర్ పెట్టేవాడని బాధితులు పోలీసుల ముందు వాపోయారు. దీంతో అతని పాపాల చిట్టాను వెలికి తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితీశ్‌కు ఇక మూడింది ... బీహార్ రావణకాష్టంగా మారింది : లాలూ ప్రసాద్