Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య.. ముగ్గురు పిల్లలున్న కామాంధుడు ఫ్రెండ్ చెల్లిని చెరబట్టి రేప్

వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వ

Advertiesment
భార్య.. ముగ్గురు పిల్లలున్న కామాంధుడు ఫ్రెండ్ చెల్లిని చెరబట్టి రేప్
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (20:13 IST)
వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కేతావత్‌ రాజు(25) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, రాజు వద్ద ఓ యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో రాజు స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్లివచ్చేవాడు. ఆ క్రమంలో రాజు అతడి చెల్లెలు(16)పై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పడంతో ఆ యువతి నమ్మేసింది. 
 
ఈ క్రమంలో ఈనెల 19వ తేదీన మల్కాజ్‌గిరి నుంచి కర్నూలు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కూతురు కనిపించడం లేదని బాలిక తల్లి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలుకు తీసుకెళ్లిన రాజు... ఆ యువతిని చెరబట్టి అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న రాజస్థాన్... నేడు మధ్యప్రదేశ్.. ఉప ఎన్నికల్లో "హస్త"వాసి