Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పళ్ళతో గొంతు కొరికిమరీ హత్య చేసే సైకో... ఎక్కడ? (వీడియో)

పగలు, ప్రతీకారాలతో రగిలిపోయేవారు క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతుంటారు. కానీ, ఈ సైకో మాత్రం పిడికెలు మెతుకులు పెట్టలేదన్న కోపంతో కక్షగట్టిమరీ చంపేస్తుంటాడు. అంతేనా, హత్య చేస్తాను.

Advertiesment
పళ్ళతో గొంతు కొరికిమరీ హత్య చేసే సైకో... ఎక్కడ? (వీడియో)
, బుధవారం, 21 మార్చి 2018 (20:03 IST)
పగలు, ప్రతీకారాలతో రగిలిపోయేవారు క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతుంటారు. కానీ, ఈ సైకో మాత్రం పిడికెలు మెతుకులు పెట్టలేదన్న కోపంతో కక్షగట్టిమరీ చంపేస్తుంటాడు. అంతేనా, హత్య చేస్తాను. డబ్బులు దొంగలిస్తాను.. అయితే నగలు మాత్రం దొంగలించడట. ఆ సైకో పేరు మునుస్వామి. వేలూరు మునుస్వామి. 
 
ఈ నరహంతకుడు ఒక యేడాదిలో ఎనిమిది హత్యలకు పాల్పడ్డాడు. ఈ హత్యలన్నీ కేవలం అన్నం పెట్టలేదనీ, ఫోన్ అడిగినందుకు ఇవ్వలేదన్న అక్కసుతోనే చేసినవి కావడం గమనార్హం. ఈ హత్యలు కూడా అతి కిరాతకంగా, పళ్ళతో గొంతు కొరికి మరీ చంపేశాడీసైకో. ఈ సైకో వివరాలను పరిశీలిస్తే, 
 
వేలూరుకు చెందిన ఇతడు 2000 సంవత్సరం ప్రారంభం నుంచే దొంగలించడం మొదలెట్టాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ దంపతుల హత్య కేసులో ఇతడి వేలిముద్రలు సరిపోవడంతో అతడిని అరెస్టు చేశారు. కొన్ని నెలల క్రితం అదే ఏపీలో ఓ జంట హత్యకు గురైంది. ఈ జంట హత్య కేసులో కూడామునుస్వామినే కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
ఈ జంట హత్యలో మునుస్వామి పంటిగాట్లు, వేలిముద్రలు సరిపోలినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆయన వద్ద జరిపిన విచారణలో నివ్వెరపోయే నిజాలను వెల్లగక్కాడు. పగలంతా రోడ్ల వెంట తిరిగే ఈ సైకో.. ఒంటరిగా ఉన్న ప్రజలనే టార్గెట్ చేస్తాడు. అన్నం పెట్టమంటాడు. ఫోన్ ఇస్తే కాల్ చేసి తిరిగి ఇచ్చేస్తానంటాడు. ఇలా అతను అడిగిన వెంటనే అన్నం పెడితే ఓకే, సెల్ ఫోన్ ఇచ్చేస్తే సరేసరి. 
 
ఇవ్వను, అన్నం లేదు ఫో అని ఎవరైనా చెప్పారంటే.. వారిని గుర్తు పెట్టుకునిమరీ రాత్రిపూట వచ్చి చంపేస్తాడు. పంటికి పనిచెప్పి కొరికిమరీ చంపేస్తాడని తేలింది. ఇతడు చిత్తూరు జిల్లాలో జరిగిన పలు హత్యలకు కారకుడని తేలాడు. ఇతడి చేతిలో హత్యకు గురైన వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఇలా ఒకే యేడాదిలో 8 మందిని చంపేసినట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులకు చెప్పారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధానిని కలుస్తుంటా : విజయసాయి రెడ్డి