Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా ఇంటి ఆడపడుచును పంపిస్తాం అత్యాచారం చేసుకోండి.. ఎక్కడ?

ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి జరిగింది. ఇంటి ఆడపడుచును అత్యాచారం చేసుకోమని ఓ కుటుంబం పంపించింది. ఈ ఘటన దేశంలో సంచలనం కావడంతో దీనికి బాధ్యులైన వారిలో పది మం

మా ఇంటి ఆడపడుచును పంపిస్తాం అత్యాచారం చేసుకోండి.. ఎక్కడ?
, గురువారం, 29 మార్చి 2018 (12:28 IST)
ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి జరిగింది. ఇంటి ఆడపడుచును అత్యాచారం చేసుకోమని ఓ కుటుంబం పంపించింది. ఈ ఘటన దేశంలో సంచలనం కావడంతో దీనికి బాధ్యులైన వారిలో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాకిస్థాన్ దేశంలోని బోబాతెక్ సింగ్ అనే గ్రామంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టారు. నిందితుడి కుటుంబం ఆ పంచాతీకి హాజరైంది. మీ ఇంటి అమ్మాయిని తమ బిడ్డ అత్యాచారం చేసినందుకు ప్రతిగా.. మా ఇంటి ఆడపడుచును (నిందితుడి సోదరిని) పంపిస్తాం అత్యాచారం చేసుకోవచ్చని చెప్పింది. అదీకూడా తొలుత అత్యాచారానికి గురైన బాధితురాలి సోదరుడు రేప్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ అసాధారణ ప్రతిపాదనతో గ్రామ పంచాయతీ పెద్దలు ఒక్కసారి అవాక్కయ్యారు. దీనికి బాధితురాలి కుటుంబం కూడా నిస్సంకోచంగా అంగీకరించడం గమనార్హం. 
 
నిందితుడి కుటుంబ సభ్యులు అసాధారణ ప్రతిపాదనకు సమ్మతించిన గ్రామ పంచాయతీ పెద్దలు కూడా ఇదే తీర్పును అమలు చేశారు. పైగా, తొలి అమ్మాయిని ఏ గదిలో ఎక్కడ రేప్ చేశారో, అదే గదిలోకి నిందితుడి సోదరిని బాధితురాలి సోదరుడిని పంపించి గది తలుపులు వేశారు. ఈ చర్యపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేలా జరిగిన ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉందనీ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర బీజేపీ ప్రక్షాళనకు శ్రీకారం.. హరిబాబుకు ఉద్వాసన