Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్ర బీజేపీ ప్రక్షాళనకు శ్రీకారం.. హరిబాబుకు ఉద్వాసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రక్షాళనకు ఆ పార్టీ హైకమాండ్ శ్రీకారం చుట్టనుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న క

Advertiesment
రాష్ట్ర బీజేపీ ప్రక్షాళనకు శ్రీకారం.. హరిబాబుకు ఉద్వాసన
, గురువారం, 29 మార్చి 2018 (12:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రక్షాళనకు ఆ పార్టీ హైకమాండ్ శ్రీకారం చుట్టనుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న కె. హరిబాబుకు ఉద్వాసన పలుకనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాలరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నట్టు సమాచారం. 
 
ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, హరిబాబు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని భావిస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడు దూకుడుగా లేకపోతే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందనే భావనకు అగ్ర నేతలు వచ్చారు.
 
దీంతో రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. వీరిలో మాణిక్యాలరావువైపు అధిష్టానం మొగ్గుచూపింది. దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. మాణిక్యాలరావు నియామకంలో ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి : ఉండవల్లి