Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీనేజ్ లవ్? యువకుడితో కలిసి ఆటోలో వెళ్లిపోయిన బాలిక, చివరకి?

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (16:49 IST)
వారిద్దరిదీ టీనేజే. ఐతే ఇద్దరిళ్లలో ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్లిద్దరూ కలిసి ఆటోలో ఎక్కి పారిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జూలై 12 నుండి తన కుమారుడు కనిపించడంలేదని ఒక వ్యాపారవేత్త ఫిర్యాదు చేసాడు. అదే రోజు నుంచి తన కుమార్తె కనబడటంలేదని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అధికారి ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి సెల్ ఫోన్ సిగ్నళ్ల ప్రకారం వీరిద్దరూ చండీగఢ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది. ఇండోర్‌లోని తుకోగంజ్, ఎంఐజి పోలీస్ స్టేషన్ సమన్వయంతో పిల్లలిద్దరితో మాట్లాడిన తరువాత పోలీసులు వారిని కోటాకు పిలిచారు. ఈ రోజు వారిని ఇండోర్‌కు తీసుకురానున్నారు.
 
ఇండోర్ లోని ఓ ధనిక ప్రాంతం నుండి ఇద్దరు పిల్లలు కలిసి వెళ్లిపోతున్నట్లు ఓ వీడియో కూడా బయటపడింది. బాలిక ఇంటి ముందు ఆటో ఆగినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీని తరువాత అమ్మాయి ఆటోలో వెళ్లిపోయింది. బాలిక తండ్రి పితాంపూర్ లోని ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఇండోర్ లోని శ్రీనగర్ ప్రాంతంలో నివశిస్తున్నారు. ఇద్దరి బంధువులు తుకోగంజ్ పోలీస్ స్టేషన్, ఎంఐజి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు.
 
జూలై 12 సాయంత్రం 5 గంటల నుండి తమ కుమారుడు తప్పిపోయినట్లు బాలుడి కుటుంబం చెబుతోంది. కాగా పిల్లలు ఇద్దరూ దేవాస్, భోపాల్, ఖార్గోన్,  జైపూర్లలో ఉంటారని భావించారు. బుధవారం అర్థరాత్రి జైపూర్ చుట్టుపక్కల బాలుడు సంచరించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఐతే శుక్రవారం ఉదయం ఇద్దరి స్థానం చండీగఢ్‌లో వున్నట్లు కనుగొనబడింది. పిల్లలు ఇద్దరూ వీడియో కాలింగ్ ద్వారా కుటుంబాలతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments