Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికను అలా వేధించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్.. అంతే ఉద్యోగం గోవిందా

బాలికను అలా వేధించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్.. అంతే ఉద్యోగం గోవిందా
, మంగళవారం, 13 జులై 2021 (16:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో అభ్యంతరకరమైన ప్రవర్తన, అసభ్యకర మెసేజ్‌లతో బాలికను వేధించాడనే ఆరోపణలపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ దీపక్ సింగ్‌ని తొలగించారు ఐజీ అనిల్ కుమార్ రాయ్. ఈ ఏడాది మార్చి 19వ తేదీన, కొత్వాలి ప్రాంతానికి చెందిన బాలిక ఫిర్యాదు చేయగా.. అతనిని సస్పెండ్ చేసి మార్చి 21న అరెస్టు చేసి జైలుకు పంపారు.
 
వివరాల్లోకి వెళితే.. కొత్వాల్‌లోని సోనుపార్ చౌకి ప్రాంతంలో నివసిస్తున్న బాలిక తన అమ్మమ్మకు మెడిసిన్ తీసుకుని వచ్చేందుకు బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ దీపక్ సింగ్ ఆమెను ఆపి పేపర్లు తనిఖీ చేసే నెపంతో మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఆరోజు నుంచి నిందితుడు ఇన్‌స్పెక్టర్ ఆమె నంబర్‌కు కాల్ చేయడం ప్రారంభించాడు. అసభ్య మెసేజ్‌లు పెట్టడం చేశాడు.
 
దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు చేసిందనే కోపంతో, కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశాడు ఇన్‌స్పెక్టర్. బాలిక కుటుంబ సభ్యులపై పోలీసులు ఎనిమిది కేసులు నమోదు చేశారు. దీనిపై బాలిక ఉన్నతాధికారులకు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ముఖ్యకమంత్రి వరకు చేరింది.
 
ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏడీజీ అఖిల్ కుమార్, డివిజనల్ కమిషనర్ అనిల్ కుమార్ సాగర్ గ్రామానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. దోషిగా తేలిన తరువాత, ఇన్‌స్పెక్టర్‌తో పాటు, అప్పటి సీఐ సిటీ గిరీష్ కుమార్ సింగ్ కూడా సస్పెండ్ అయ్యారు. బాలిక ఫిర్యాదుపై, కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌తో సహా 12మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై విడుదలయ్యాక ఇన్‌స్పెక్టర్‌ను బహ్రాయిచ్‌కు బదిలీ చేశారు. వేధింపులు జరిగినలట్లుగా లేటెస్ట్‌గా పక్కా ఆధారాలు దొరకడంతో అతనిని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘అఫర్డబిలిటీ క్యాంపెయిన్‌’ ప్రారంభించిన బోష్‌ పవర్‌టూల్స్‌