Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘అఫర్డబిలిటీ క్యాంపెయిన్‌’ ప్రారంభించిన బోష్‌ పవర్‌టూల్స్‌

Advertiesment
‘అఫర్డబిలిటీ క్యాంపెయిన్‌’ ప్రారంభించిన బోష్‌ పవర్‌టూల్స్‌
, మంగళవారం, 13 జులై 2021 (16:52 IST)
బోష్‌ పవర్‌ టూల్స్‌ అధికారికంగా ‘ద అఫర్డబిలిటీ క్యాంపెయిన్‌’ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తంమ్మీద తమ ఉపకరణాల యాజమాన్య నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించనున్నారు. కీలకమైన విడిభాగాల ధరలను విభిన్నమైన ఉపకరణాల వ్యాప్తంగా సవరించనుండటం ద్వారా నాణ్యమైన మరియు అందుబాటు ధరలలో మరమ్మత్తులను తమ వినియోగదారులకు అందించనున్నారు.
 
మహమ్మారి పరిస్థితులతో దేశం తమ పోరాటం కొనసాగిస్తున్న వేళ, బోష్‌ పవర్‌ టూల్స్‌ అసాధారణ డిమాండ్‌ను 2020 రెండవ త్రైమాసంలో చూసింది. మార్కెట్లకు పరిమితమైన ప్రాప్యత ఉండటం వల్ల వినియోగదారులు తమంతట తాముగా మరమ్మత్తులను చేసుకోవడంపై ఆధారపడ్డారు. ఈ కారణం చేత టూల్స్‌ మరియు యాక్ససరీలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. లభ్యతపై బోష్‌ యొక్క యూజర్‌ క్యాంపెయిన్‌ ద్వారా ఈ డిమాండ్‌ను అందుకోవడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. 
 
ఈ కారణం చేతనే విడిభాగాల ధరలను గణనీయంగా తగ్గించడంతో పాటుగా సురక్షితమైన, నాణ్యమైన ఉపకరణాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్య వ్యాపారాలు అతి సులభంగా ఉపకరణాలను సొంతం చేసుకోవడంతో పాటుగా వాటిని వినియోగించడమూ చేయవచ్చు. తద్వారా తమ ఉత్పాదకతను, సంపాదన సామర్థ్యం మరియు భద్రతను దీర్ఘకాలంలో వృద్ధి చేసుకోవచ్చు.
 
ఈ ‘అఫర్డబుల్‌ క్యాంపెయిన్‌’ ద్వారా విడిభాగాలు అతి సులభంగా లభిస్తాయనే అంశాన్ని ప్రచారం చేయడంతో పాటుగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యత మరియు భద్రత ప్రమాణాలను విభిన్నమైన వాణిజ్యవిభాగాలలో ఎలాంటి రాజీలేకుండా నిర్వహిస్తామనే భరోసానూ అందిస్తుంది. ఈ ప్రచారం ద్వారా లభించే ప్రాప్యతతో  భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేనటువంటి రీతిలో తయారుచేసే నకిలీ, మోసపూరిత విడిభాగాల ప్రభావం తగ్గించనున్నారు.
 
బోష్‌ మొట్టమొదటిసారిగా అఫర్డబల్‌ టూల్స్‌ను 2016-17 సంవత్సరంలో ఆరంభించింది. తద్వారా వాణిజ్య వ్యాపారులకు తొలి పెట్టుబడుల భారం తగ్గించడం లక్ష్యంగా చేసుకుంది. ఈ నూతన తగ్గింపు ధరలు మరింతగా యాజయాన్య నిర్వహణ ఖర్చులను ఈ వినియోగదారులకు మెరుగుపరచనుంది.
 
ఈ వినియోగదారుల ప్రచారం గురించి నిశాంత్‌ సిన్హా, రీజనల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌, బోష్‌ పవర్‌టూల్స్‌- ఇండియా అండ్‌ సార్క్‌ మాట్లాడుతూ, ‘‘నాణ్యతతో ప్రాప్యతను మిళితం చేసేందుకు మేము తీవ్రంగా శ్రమించడంతో పాటుగా మా లక్ష్యం, అత్యుత్తమ జీవనం కోసంఅందుబాటు ధరలలో పరిష్కారాల ద్వారా వినియోగదారులకు ఆనందం కలిగించడంను విస్తరించాం. ప్రాధమిక స్థాయిలో వినియోగదారుల సమస్యలను తీర్చడం ద్వారా మా ప్రచారం వాణిజ్యవేత్తలు మరియు డీలర్‌ వ్యవస్థకు వారి అవసరాలకు తగినట్లుగా ధరల వద్ద ఉత్పత్తులు మరియు విడిభాగాలను అందించడం లక్ష్యంగా చేసుకుంది’’ అని అన్నారు.
 
గత కొద్ది సంవత్సరాలుగా పవర్‌టూల్స్‌ విభాగం గణనీయంగా మార్పులకు లోనవుతుంది. సౌకర్యం మరియు ఉత్పాదకత పరంగా మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతతో పాటుగా అత్యున్నత భద్రతా సామర్థ్యంలను సైతం కోరుకుంటున్నారు. నాణ్యమైన ఉపకరణాల కోసం వృద్ధి చెందుతున్న ఈ డిమాండ్‌ మరింతగా ఆవిష్కరణ మరియు ఉత్పత్తిని బోష్‌ పవర్‌ టూల్స్‌ ఇండియా వద్ద గత కొద్ది సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తుంది. ఈ సంస్థ భారతదేశంలో తమ కార్యకలాపాలను 1997లో ప్రారంభించింది మరియు 2021 నాటికి చెన్నైలోని తయారీ కేంద్రం వద్ద 10 మిలియన్‌ మైలురాయిని అధిగమించింది. నూతన బోష్‌ పవర్‌ టూల్స్‌ ఇండియా ఇప్పుడు భారతీయ మార్కెట్‌ అవసరాలకు తగినట్లుగా  విభిన్న ధరల వద్ద ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి సారించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌కు... పీవి శ‌త‌జ‌యంతి పుస్త‌కాలు