Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి.. ఆ వృద్ధుడు చితిపై పడుకుని నిప్పంటించుకున్నాడు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (18:38 IST)
వృద్ధుడైపోయాడు. భార్య కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అన్నీ తానై చూసుకోవాల్సిన కుమారుడు కూడా మరణించాడు. ఇక ఒంటరితనం ఆ వృద్ధుడిని వేధించింది.

అనాథగా మారిపోయిన అతనికి భార్య, కుమారుడి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయి. దాంతో తనను తాను పోషించుకోలేక.. జీవితంపై విరక్తితో ఆ వృద్ధుడు తనకు తానే చితిని పేర్చుకుని.. దానిపై పడుకుని నిప్పంటించుకున్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరుకు చెందిన అజ్జప్ప (85) కుమారుడు సిద్ధప్ప (58) గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.
 
కోడలు, మనవళ్లు ఉన్నా.. గొడవల కారణంగా పట్టించుకోలేదు. దాంతో అజ్జప్ప మానసికంగా కృంగిపోయాడు. ఊరు వదలి వెళ్లిపోయి దేవాలయాలు, పాడుబడ్డ భవనాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఐతే నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదు. ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో సగం కాలిన వృద్ధుడి శవాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహం అజ్జప్పదని తేల్చారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments