భార్యకు దెయ్యం: ముగ్గురు మంత్రగాళ్ళు అత్యాచారం, ఆ తర్వాత?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (18:35 IST)
హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియా. రాజు, నర్సమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వరంగల్ సిటీకి చెందిన వీరు కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లోని ఉప్పల్‌కు వెళ్ళి సెటిల్ అయ్యారు. రాజు, నర్సమ్మ ఇద్దరూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు.
 
అయితే గత రెండురోజుల నుంచి నర్సమ్మ వింతవింతగా మాట్లాడుతూ ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు రాజు. అయితే ఆమెకు వైద్యులు చికిత్స చేయలేకపోయారు. దీంతో ఉప్పల్ ఏరియాలో ఒక మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్ళారు. నర్సమ్మకు దెయ్యం పట్టిందని చెప్పిన ఆ మాంత్రికుడు ఒక రోజుంతా ఆమెను తన దగ్గరే ఉంచాలన్నాడు. అలా ఉంచితే దెయ్యాన్ని వదిలిస్తానన్నాడు. 
 
దీంతో అతడిని నమ్మిన రాజు నర్సమ్మను అక్కడే వదిలి వెళ్ళాడు. ఒకరోజు పాటు నర్సమ్మపై అత్యాచారం చేశాడు మాంత్రికుడు. ఆ తరువాత దెయ్యం వదల్లేదని నర్సమ్మను పంపించేశాడు. రాజు మరో మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్ళాడు. అతను కూడా ఇలాగే చేశాడు. నర్సమ్మపై అత్యాచారం చేశాడు.
 
అక్కడ దెయ్యం వదల్లేదని మాంత్రికుడు చెప్పాడు. దీంతో ఇంకో మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్ళాడు రాజు. అతను కూడా నర్సమ్మపై అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి ఉప్పల్ పోలీస్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ముగ్గురు మాంత్రికులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments