క్రియేటివ్ డైరెక్టర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కృష్ణవంశీ. ఎన్నో వైవిధ్యమైన.. విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు దర్శకుడుగా టాప్ లిస్టులో ఉన్న కృష్ణవంశీ సరైన సక్సస్ లేకపోవడంతో బాగా వెనకబడ్డారు. కొన్ని సినిమాలు అనుకున్నప్పటికీ సెట్స్ పైకి వెళ్లకుండా రకరకాల కారణాల వలన ఆగిపోయాయి.
ఇదిలాఉంటే.. కృష్ణవంశీ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... నటసామ్రాట్ అనే మరో వినూత్న సినిమా చేయబోతున్నారట. ఇది మరాఠీ రీమేక్ సినిమా. ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు.
ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. నాగార్జున హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ నటించింది. మళ్లీ ఇంత కాలానికి సతీమణి రమ్యకృష్ణను కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తుండటం విశేషం.