మహేష్ బాబు చేతులు మీదుగా 'మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్ రిలీజ్

బుధవారం, 16 అక్టోబరు 2019 (16:21 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇక వాటితో పాటు ఇటీవల ఆయన కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బ్యానర్ పైన తెరకెక్కుతున్న ఫస్ట్ మూవీ ‘మీకు మాత్రమే చెప్తా’.

ఫస్ట్ లుక్ నుండి మొన్నటి టీజర్ రిలీజ్ వరకు ఆడియన్స్‌లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు సాయంత్రం గం.4.30ని.లకు రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
 
తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వినయ్ వర్మలు నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్‌కు షమ్మిర్ సుల్తాన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మంచోడు అనే ఇమేజ్‌ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ ఇమేజ్‌ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఎంతో ఫన్నీగా సాగే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ సినిమా, నేటి యూత్‌కు ఎంతో కనెక్ట్ అవుతుంది అని అంటోంది సినిమా యూనిట్. 
 
ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని మదన్‌ గుణదేవా, సంగీతాన్ని శివకుమార్‌ అందిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అనుకోని అతిథిగా వస్తున్న ఫిదా బ్యూటీ...