విక్టరీ వెంకటేష్ - యువ సమ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మల్టీస్టారర్ వెంకీ మామ. జై లవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించి చిన్నసైజ్ టీజర్ రిలీజ్ చేసారు.
ఇక టీజర్ విషయానికి వస్తే... ఫస్ట్ షాట్‌లోనే వెంకటేష్ మోటార్ బైక్ పైన 'జై జవాన్, జై కిసాన్' అనే బోర్డు చూపించి ఈ సినిమా పాయింట్ ఏంటి అనేది చెప్పకనే చెప్పేసారు. ఇక ఈ టీజర్ అంతా కూడా వెంకీ హవా సాగింది. రెండు డైలాగ్స్ కూడా వెంకటేష్ మీదే కట్ చేసారు. ఒకసారి పవర్‌ఫుల్‌గా డైలాగ్ చెప్పి ఫైట్ చేసిన వెంకీ మరొక చోట 'ఐ లవ్ యు అనేసింది' అని ఉబ్బితబ్బిబవుతూ కామెడీ పండించాడు.
చైతూని అల్లుడు అని పిలుస్తూనే డైలాగ్స్ చెప్పాడు వెంకటేష్. చైతూని అలా పిలుస్తుంటే... వినడానికి.. చూడడానికి చాలా బాగుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి అనే ఫీలింగ్ కలిగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే... వెంకీమామ సినిమాపై అంచనాలను పెంచేసాడు.
ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అంటే ఈ సినిమాపై క్రేజ్ ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని సమాచారం.