Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెంకీమామ సినిమా చూస్తే ప్రేక్ష‌కుల‌ు షాక్ అవుతారట...

Advertiesment
వెంకీమామ సినిమా చూస్తే ప్రేక్ష‌కుల‌ు షాక్ అవుతారట...
, సోమవారం, 13 మే 2019 (20:40 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. దీనికి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌కుడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రియ‌ల్ లైఫ్‌లో మేన‌మామ - మేన‌ల్లుడు అయిన వెంకీ - చైతు ఈ సినిమాలో కూడా రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్సే పోషిస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 
 
అయితే... వెంకీ మామ అని టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే ఇది ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అనుకున్నారు. అయితే... లోగో రిలీజ్ చేసిన త‌ర్వాత ఈ క‌థ‌లో విష‌యం ఉంద‌నుకున్నారు సినీ జ‌నం. ఇక ఇప్పుడు అబ్బో ఇందులో చాలా విష‌యం ఉంది అంటున్నారు నెటిజ‌న్లు. ఎందుకంటే.. ఇందులో చైత‌న్య సైనికుడుగా న‌టిస్తున్నాడు. వెంక‌టేష్ రైస్ మిల్ ఓన‌ర్‌గా న‌టిస్తున్నారు. ఇండియ‌న్ బోర్డ‌ర్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.
 
డైరెక్ట‌ర్ బాబీ ప్ర‌స్తుతం బోర్డ‌ర్లో ఎక్క‌డ షూటింగ్ చేస్తే బాగుంటుందో లోకేష‌న్స్ సెర్చ్ చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసాడు. అంద‌రూ అనుకుంటున్న‌ట్ట‌గా ఇది కేవ‌లం ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ మాత్ర‌మే కాద‌ట‌. అంత‌కుమించి ఈ క‌థ‌లో చాలా విష‌యం ఉంద‌ట‌. ఇంకా చెప్పాలంటే చాలా బ‌ల‌మైన క‌థ ఉంద‌ట‌. థియేట‌ర్‌కి వెళ్లిన ఆడియ‌న్ ఈ సినిమా చూసి షాక్ అవుతాడ‌ట‌. ఆ రేంజ్‌లో క‌థ ఉంద‌ట‌. ఇదే క‌నుక జ‌రిగితే... సినిమా పెద్ద హిట్టే..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మకు ఘోరమైన శిక్షను ఇచ్చేస్తా: శ్రీరెడ్డి ఎమోషనల్ ట్వీట్