రమేష్ ప్రసాద్‌ గారికి సతీ వియోగం, పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి

శుక్రవారం, 18 అక్టోబరు 2019 (14:35 IST)
ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ గారి సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. గుండెపోటు కారణంగా రాత్రి నిద్రలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. 
 
ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ గారితో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. విజయలక్ష్మి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
 
రమేష్ ప్రసాద్‌ని పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ నిర్మాత ప్రసాద్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ భార్య అక్కినేని విజయలక్ష్మి గురువారం మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు (శుక్రవారం) ఉదయం రమేష్ ప్రసాద్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి చేరుకుని ఆయనను పరామర్శించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చిరు కొరటాల మూవీ- దేవాదాయ శాఖలో ఉద్యోగిగా మెగాస్టార్?