Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?

Advertiesment
చికెన్ బిర్యానీలో పొడవాటి పురుగులు.. కోడిని అమ్మినవాడే కారణమట?
, బుధవారం, 16 అక్టోబరు 2019 (10:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరం శివారు ప్రాంతమైన తిరునిండ్రవూరులోని ఓ హోటల్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు వాంతులే మిగిలాయి. హోటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు వుండటాన్ని చూసి వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై, తిరునిండ్రవూరు‌లోని ఓ హోటల్‌కు వెళ్లిన వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అందులో పొడవాటి పురుగులు వుండటాన్ని చూసి షాకయ్యాడు. ఆపై హోటల్ యజమానికి ఫిర్యాదు చేశాడు. 
 
కానీ హోటల్ నిర్వాహకులు కస్టమర్ చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ కస్టమర్ పురుగులతో కూడిన బిర్యానీని ఫోటో తీసి ఫుడ్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరపడంలో తేలిందేమిటంటే? కోడిని అమ్మిన వ్యక్తే కారణమని హోటల్ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వం వల్లనే ఆర్టీసీ సమ్మె జటిలం.. మోదీకి తమిళిసై వివరణ