Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరా ధమాకా, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు @8.15%, అంతా అటే వెళ్లిపోతారంతే...

Advertiesment
దసరా ధమాకా, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు @8.15%, అంతా అటే వెళ్లిపోతారంతే...
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (16:37 IST)
దసరా పండుగ అనగానే ఉద్యోగులు బోనస్‌లు వస్తాయని ఎదురుచూస్తుంటారు. ఏదో ఇంటి రుణాలు తీసుకున్న EMI కట్టేందుకు కాస్త చేదోడువాదోడుగా వుంటాయని అనుకుంటారు. ఐతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చేసింది. 
 
ఆ బహుమతి ఏంటంటే... హోమ్ లోన్ వడ్డీ రేటు 8.15%గా ప్రకటించింది. ఇంత తక్కువ వడ్డీ రేటుకి ఏ బ్యాంకు ఇప్పటివరకూ గృహ రుణం ఇవ్వడంలేదు. తగ్గించిన ఈ వడ్డీ రేటు అక్టోబరు 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు తెలియజేసింది. కొత్తగా ఇంటి రుణాలు తీసుకోదలచినవారంతా ఎస్బీఐ ఆఫర్ దెబ్బకు అటే వెళ్లిపోతారనడంలో సందేహం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుది అవినీతి పాలన... జగన్‍‌ది నీజాయితీ పాలన : లక్ష్మీపార్వతి