బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

ఠాగూర్
శుక్రవారం, 25 జులై 2025 (15:36 IST)
ఓ యువకుడు తన అధిక బరువును తగ్గించేందుకు పాటించిన ఫ్రూట్ జ్యూస్ డైట్ చివరకు అతని ప్రాణాలు తీసింది. గత మూడు నెలలుగా బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోవడంతో 17 యేళ్ళ వయసులోనే మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కొలచ్చల్ అనే ప్రాంతంలో జరిగిది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శక్తీశ్వరన్ అనే యువకుడు అధిక బరువుతో బాధపడుతూ వచ్చాడు. ఈ బరువు తగ్గేందుకు ఆయన పలు రకాలైన ఆహార నియమాలను పాటిస్తూ వచ్చాడు. ఇందులో ఒకటి... ఫ్రూట్ జ్యూస్ డైట్ ఒకటి. అలాగే, బరువుతగ్గేందుకు యూట్యూబ్ వీడియోల్లో చెప్పిన సలహాలు మాత్రమే పాటిస్తూ వచ్చాడు. అదేసమయంలో త్వరితగతిన బరువు తగ్గేందుకు వ్యాయామాలు కూడా చేసేవాడు. 
 
ఈ క్రమంలో గురువారం ఊపిరి ఆడకపోవడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments