Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో విషయం చెప్పిందని కూతుర్ని చంపేసింది..

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (13:50 IST)
స్మార్ట్‌ఫోన్లు, ఆధునికత పెరగడంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం కన్నబిడ్డలనే మట్టుబెడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.
 
తాజాగా అక్రమసంబంధ వ్యవహారాన్ని భర్తకు చెప్పేసిన కన్నకూతురిని హతమార్చింది.. ఓ కిరాతక తల్లి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న వీరగనూర్ జిల్లాకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి... సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య ప్రియాంక గాంధీ, నాలుగేళ్ల శివానితో కలిసి ఇక్కడే వీరగనూర్ గ్రామంలో నివసిస్తోంది. 
 
భర్త ఎక్కడో దూరంగా ఉండడంతో అదే ఊరిలో వున్న వెంకటేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇంట్లో తల్లీకూతురు ఇద్దరూ మాత్రమే ఉండడంతో... అక్కడే యథేచ్ఛగా శారీరక సంబంధం కొనసాగించేవారు. 
 
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న శివానీ సింగపూరులోని తండ్రికి ఈ విషయం వెల్లడించింది. దీంతో కూతురిపై అక్కసు పెంచుకున్న ప్రియాంకా గాంధీ.. కూతుర్ని బోరు బావిలో వేసి హత్య చేసింది. అయితే తనపై అనుమానం రాకుండా వెనకాలే ప్రియాంక కూడా దూకేసింది. 
 
తల్లీకూతుర్లు ఇద్దరూ బోరుబావిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు బయటికి తీశారు. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments