ఎంటర్ ది డాటర్ : క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రియాంకా...

బుధవారం, 23 జనవరి 2019 (13:17 IST)
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రియాంకా గాంధీ వచ్చే ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
అలాగే, యూపీ వెస్ట్ విభాగం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింథియాను నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్, హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గులాం నబీ ఆజాద్‌ను నియమించారు. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాహుల్ గాంధీ తన మార్కు రాజకీయాలకు తెరదీశారు. ఇందులోభాగంగా, తన సోదరి ప్రియాంకా గాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అమ్మో... ముకేష్ అంబానీ వద్ద అంత డబ్బుందా?