Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచరమ్మపై కన్నేసిన విద్యార్థి.. అడవి మధ్యలో అత్యాచారయత్నం

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (12:43 IST)
తమిళనాడులో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ విద్యార్థి తనకు పాఠాలు నేర్పే టీచరమ్మపైనే అత్యాచారానికి ప్రయత్నించాడు. చివరికి ఆ టీచరమ్మ తనపై అత్యాచారానికి యత్నించిన విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించి తనను కాపాడుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పరిధిలోని మరుదై కొండ అనే అటవీ గ్రామం ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ వుంటారు. ఈ ప్రాంతంలోని గిరిజన ఆదివాసీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసింది. దీనికి 26 ఏళ్ల యువ ఉపాధ్యాయురాలును నియమించింది. 
 
అయితే గ్రామం చుట్టూ అడవి ఉండడం.. రెండు కిలోమీటర్లు అడవీలో ప్రయాణించి టీచర్ విద్యార్థులకు చదువు చెప్పేందుకు వచ్చేది. ప్రతిరోజు ఆ యువ టీచరమ్మ రెండు కిలోమీటర్ల నడిచివచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పి తిరిగి అడవిలో రెండు కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళేది.
 
ఈ టీచరమ్మపై ఓ విద్యార్థి కన్నేశాడు. అడవుల్లో నడుచుకుంటూ వెళ్లే టీచరమ్మతో నడుచుకుంటూ వెళ్లాడు. అడవి మధ్యలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఆమె తీవ్రంగా ప్రతిఘటించి ఆ బాలుడి నుంచి తప్పించుకుని గ్రామస్తులకు చెప్పింది. ఆగ్రహంతో గ్రామస్తులంతా బాలుడిపై తురైయూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
పోలీసులు మాత్రం బాలుడు కావడంతో కేసు నమోదు చేయలేదు. బాలుడు, టీచర్‌కు సర్ధిచెప్పి పంపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి కొండ గ్రామ ప్రజలు బాలుడిని అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments