కరోనా కరాళ నృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:32 IST)
తమిళనాడులో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 67,468కు చేరుకోగా, మృతుల సంఖ్య 866కు చేరింది. చెన్నైలో అత్యధికంగా 44,205, చెంగల్ పట్టులో 4,030, తిరువళ్లూరులో 2,826, తిరువన్నామలైలో 1,313, కాంచీపురంలో 1,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఆటాడుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14,500ల మంది మరణించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments