Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు పురపోరు : దూసుకుపోతున్న అధికార డీఎంకే

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:20 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. ఇందులో అధికార డీఎంకే సారథ్యంలోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతుంది. 
 
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపులో డీఎంకే కూటమిలోని పార్టీలు విజయం దిశగా దూసుకెళుతున్నాయి. గత పదేళ్ళపాటు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నామమాత్రపు ఫలితాలను కూడా సాధించేలా కనిపించడం లేదు. 
 
ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 1374 కార్పొరేషన్ వార్డులకు గాను డీఎంకే 57, అన్నాడీఎంకే 7 స్థానాలను, ఇతరులు 8 చోట్ల గెలిచారు. ఇకపోతే డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 7, సీపీఎం 2చొప్పున గెలుచుకున్నాయి. 
 
మున్సిపాలిటీల్లో 3843 వార్డులకు గాను డీఎంకే 248 చోట్ల విజయం సాధించింది. అన్నాడీఎంకే 79, ఇతరులు 53 చోట్ల గెలుపొందారు. పట్టణ పంచాయితీ  వార్డుల్లో 1251 వార్డుల్లో డీఎంకే విజయభేరీ మోగించింది. అన్నాడీఎంకే 354 స్థానాల్లో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments