Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీట్ పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్

నీట్  పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదా: సీఎం స్టాలిన్ అదుర్స్
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:13 IST)
NEET
నీట్  పరీక్షల నుంచి వైదొలగే ముసాయిదాను తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆదివారం వైద్య కోర్సుల కోసం జరిగే నీట్ పరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో సేలం జిల్లా, మేట్టూరు సమీపంలో నీట్ ఫియర్ కారణంగా ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాట పెను సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నీట్ పరీక్షలపై మండిపడ్డారు. 
 
నీట్ అర్హతతోనే వైద్య కోర్సుల్లో ప్రవేశం అనేది సరికాదని.. అందుకు తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. నీట్‌కు శాశ్వతంగా తొలగించే ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. ముందు నుంచే నీట్ పరీక్షలను డీఎంకే వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చాక నీట్‌పై చట్టపరంగా ఆందోళన చేపట్టనున్నట్లు స్టాలిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగరబత్తుల విక్రయానికి శ్రీకారం చుట్టిన తితిదే